Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ నగరవాసులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త

హైదరాబాద్ నగరవాసులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం (సెప్టెంబర్ 1) నుంచి ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రిపూట బస్సు సర్వీసులను పునఃప్రారంభించింది. రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలుపుతూ మొత్తం 15 బస్సులతో ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, డిమాండ్‌ను బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆయన వివరించారు.
ప్రస్తుతం నడిచే ఆరు రూట్ల వివరాలు
222A: కోఠి నుంచి పటాన్‌చెరు (అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ మీదుగా) – ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు
218: అఫ్జల్‌గంజ్/సీబీఎస్ నుంచి పటాన్‌చెరు (కోఠి, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా)
219: సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు (ప్యారడైజ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మీదుగా)
290U: హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ (ఎల్‌బీ నగర్, నాగోల్, తార్నాక మీదుగా)
195W: బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ (ఐటీ క్యాంపస్‌ల మీదుగా)
10H: కొండాపూర్ నుంచి సికింద్రాబాద్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -