Thursday, July 2, 2026
E-PAPER
Homeజాతీయండబ్బులు తీసుకొని అయోధ్య రామమందిరంలో ఉద్యోగాలు

డబ్బులు తీసుకొని అయోధ్య రామమందిరంలో ఉద్యోగాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో దర్యాప్తు అధికారులు కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్నారు. ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు వసూలు చేసి నియామకాలు జరిపినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దాదాపు 125 మందిని నియమించగా, వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు సమాచారం. నియామకాలకు సంబంధించిన అధికారిక పత్రాలు పోలీసులకు లభించలేదు. ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై కూడా దృష్టి సారించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -