Wednesday, August 12, 2026
E-PAPER
Homeజాతీయంనా ఓటు తొలగించడం హాస్యాస్పదం : ప్రకాశ్‌ రాజ్

నా ఓటు తొలగించడం హాస్యాస్పదం : ప్రకాశ్‌ రాజ్

- Advertisement -


బెంగళూరు : బెంగళూరులో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్న‌దని, ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోందని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. ఈ విషయంపై ఆయన సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పై ఆయ‌న మాట్లాడుతూ …. తాను పుట్టి పెరిగిన నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ఓటును తొల‌గించ‌డం హాస్యాస్ప‌ దంగా ఉంద‌ని అన్నారు. ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ తర్వాత బెంగళూరు నియోజ కవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో త‌న‌ది కూడా ఉన్న‌ద‌ని ప్ర‌కాశ్‌ రాజ్ తెలిపారు. తాను బెంగ‌ళూరు నియోజకవర్గంలోనే పుట్టానని, ఇక్కడే నివసించానని, చదువంతా ఇక్కడే పూర్తయిందని, నటన నేర్చుకున్న‌ది కూడా ఇక్కడేన‌ని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా తాను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని వెల్ల‌డించారు. అయినా త‌న ఓటు తొల‌గించార‌ని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -