మహిళా సంఘాల ఆందోళన
సీపీఐ(ఎం) ఎంపీ సచితానందంకు వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి “మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే” అమలు కోరుతూ ఎన్‌సీడబ్ల్యూఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన మంగళవారం 17వ రోజుకు చేరుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో జంతర్‌మంతర్ మూసివేడయంతో మహిళ సంఘాలు విబి హౌస్ వద్ద తమ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించాయి. అయితే అక్కడ కూడా ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) ఎంపీ ఆర్. సచితానందంకు వినతిపత్రాన్ని అందజేశారు. కనినికా ఘోష్ (ఐద్వా), అపరాజిత రాజా (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆ వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించి, దానిని సభలో ప్రస్తావించవలసిందిగా అభ్యర్థించారు. అనంతరం ఇంద్రజిత్ గుప్తా మార్గ్ చుట్టూ, మార్కెట్ ప్రాంతాన్ని కలుపుతూ, మాతా సుందరి కళాశాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్, సహాయ కార్యదర్శి సవిత, పంజాబ్ కార్యదర్శి కన్వల్జిత్ కౌర్, టుగెదర్ ఫర్ ట్రాంక్విలిటీ నేత భావనా శర్మ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐద్వా ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి, సీఈసీ సభ్యురాలు సర్బానీ సర్కార్, ఢిల్లీ కార్యదర్శి కవితా శర్మ, అధ్యక్షురాలు ఆశా యాదవ్, ఐద్వా సహాయ కార్యదర్శి ఆశా శర్మ, మైమూనా మొల్లా, సెహబా ఫరూఖీ, అంజు ఝా, రూపా సింగ్ పాల్గొన్నారు.
‘మహిళా కోటా’ అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -



