Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. నేడు (శుక్రవారం) ఈ చిత్రం ప్రపం చవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిషేక్ నామా మీడియాతో సినిమా విశేషాలు షేర్ చేసుకున్నారు. పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బి ఎందుకు తెరవలేదనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. దానిపై ఎన్నో కథలు ఉన్నాయి. ఆ గది లోపల ఏముందనేది అందరికీ ఎంతో ఆసక్తికరం. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఒక కథ చేస్తే బాగుం టుందని అనిపించింది. దాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ చేయాలనిపించింది. అలా నాగబంధం కథను రాశాను. ఇది నేను విజువలైజ్ చేసుకున్న కథ. నా విజన్‌ను నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని దర్శకత్వం వహిం చాను. చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ ఇది. నేను అనుకున్న సమ యానికే ఈ సినిమాను రిలీజ్ చేస్తు న్నాను. ముందుగా అనుకున్నట్లే 107 రోజుల్లో సినిమాను పూర్తి చేశాను. ఈ సినిమాలోని కాన్సెప్ట్స్ అన్నింటినీ నేనే డిజైన్ చేశాను.

మేము అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాం. అయితే అక్కడ ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఉండదు. అందుకే అక్కడ చూసిన వాటిని స్కెచ్‌ల రూపంలో పేపర్‌పై రూపొందించుకున్నాం. ఆ తర్వాత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, వేరే ఆర్కిటెక్చర్‌ను కూడా జోడించి ఆ సెట్‌ను డిజైన్ చేశాం. అయితే ఈ సినిమా కోసం మేము అనంత పద్మ నాభస్వామి ఆలయం అనే పేరును వాడడం లేదు. అదొక ఫిక్షనల్ టెంపుల్‌గానే చూపించాం. ఇది ఒక ఫిక్షనల్ ట్రెజర్ హంట్ కథ. దాన్ని ఫాంటసీ కోణంలో చెప్పాం. విరాట్ కర్ణలాంటి కొత్త హీరోతో వంద కోట్లకు పైగా ఈ సినిమా చేయటానికి కారణం ఏంటంటే, నిజానికి ఈ కథ మొదలు పెట్టినప్పుడు వంద కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకోలేదు. కొత్త నటుడితో సినిమా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇది కథ మీద నడిచే సినిమా. పెద్ద హీరో ఉంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే కొత్త హీరో అయిన విరాట్ కర్ణను ఎంపిక చేశాను.

మేము రియల్ టెంపుల్స్ లో షూట్ చేయాలని అనుకున్నాం. కానీ అను కున్నంతగా అనుమతులు దొరక లేదు. దీంతో టెంపుల్ సెట్ వేయాల్సి వచ్చింది. సెట్స్, ఆర్ట్ వర్క్, మేకప్, సిజీ విషయంలో బడ్జెట్ కూడా పెరిగింది. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది సెట్లు ఉన్నాయి. ఈ సినిమా కోసం మేం పెట్టిన ఖర్చులో ఎక్కువ భాగం ఆర్ట్‌వర్క్, సెట్స్, సీజీకే వెళ్లింది. 20 శాతం రెమ్యూన రేషన్లకు, 80 శాతం ప్రొడక్షన్‌కు ఖర్చు చేశాం. మా నిర్మాతలు మొదటి నుంచి కథను, నన్ను పూర్తిగా నమ్మి సినిమా కోసం ఖర్చు చేశారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా కథకు ఏం అవసరమో అది అందించారు. ఈ విషయంలో వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఫైనల్ అవుట్‌ పుట్ విషయంలో చాలా హ్యాపీగా వున్నారు. నిర్మాతలు రాకముందే ఈ సినిమాకు పకడ్బందీగా ప్రీ-ప్రొడక్షన్ చేశాను. సినిమా ఎలా ఉండబోతోంది, విజువల్స్ ఎలా ఉంటాయో ముందు గానే వారికి చూపించాను. అందుకే వారికి పూర్తి క్లారిటీ వచ్చింది. ఇది మైథాలజీ మాత్రమే కాదు, ఒక కమర్షియల్ సినిమా కూడా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

బాలీవుడ్‌లో చాలా మంచి స్పందన వచ్చింది. దాదాపు 700కి పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. తమిళంలో 200కి పైగా స్క్రీన్లలో విడుదల అవు తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2500కి పైగా స్క్రీన్లలో సినిమా విడుదల అవుతోంది.
దర్శకుడు అభిషేక్ నామా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -