రంగారెడ్డిపై కరీంనగర్ గెలుపు
టీజీ20 లీగ్ 2026
నవతెలంగాణ-హైదరాబాద్ : రాహుల్ రాడేశ్ (72, 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), హృషికేశ్ సింహా (60, 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో జోరందుకోవటంతో రంగారెడ్డి రైజర్స్‌పై కరీంనగర్ డైమండ్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీజీ20 లీగ్ దశ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు సాత్విక్ రెడ్డి (24), తన్మయ్ అగర్వాల్ (29) శుభారంభం అందించగా.. హృషికేశ్ సింహా, రాహుల్ రాడేశ్ మూడో వికెట్‌కు 65 బంతుల్లో 123 పరుగులు జోడించి ఆ జట్టుకు భారీ స్కోరు అందించారు. చందన్ సహాని (19), శుభమ్ శర్మ (17 నాటౌట్) రాణించారు. ఛేదనలో రంగారెడ్డి రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేసింది. బౌలర్లు నారాయణ తేజ (3/25), దినేశ్ (2/25), శుభమ్ శర్మ (2/38) దెబ్బకు రంగారెడ్డి రైజర్స్ విలవిల్లాడింది. ఆదిత్య జవ్వాజి (48), ఆర్యన్ కరియప్ప (30 నాటౌట్) రాణించారు. రాహుల్ రాడేశ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వరుస ఓటములతో సీజన్‌ను మొదలెట్టిన కరీంనగర్ డైమండ్స్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌లో చోటుకు చేరువైంది.
రాహుల్, సింహా జోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



