నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ ఫిబ్రవరి 28న జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంత్యక్రియలకు వీలు కలుగలేదు.
ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని టెహ్రాన్‌లో అంత్యక్రియలు ప్రారంభమై, పలు రోజుల పాటు కొనసాగనున్నాయి. దీని తర్వాత, ఇరాన్‌లోని నజఫ్, కర్బలా పవిత్ర నగరాలకు ఖమేనీ మృతదేహాన్ని తీసుకెళ్తారు. చివరగా ఆయన స్వస్థలమైన మషాద్‌లో ఇమామ్ రిజా దర్గా వద్ద జూలై 9న ఖననం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇరాన్ పలు దేశాలధినేతలకు ఆహ్వానాలు అందించింది. భారత్, పాక్, చైనా సహా పలు దేశాలు తమ ప్రతినిధులు హాజరవుతున్నారు.








