Friday, July 3, 2026
E-PAPER
Homeజాతీయంరూ.3 కోట్లకు ఈడీ విమానం కొనుగోలు

రూ.3 కోట్లకు ఈడీ విమానం కొనుగోలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకున్న ఓ విమానాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది. హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్‌(Hawker) 800A విమానాన్ని విక్రయించేందుకు ఈ నెల 1న ఎంఎస్‌టీసీ ద్వారా ఆక్షన్ నిర్వహించగా.. రూ.3 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.హాకర్ 800A విమానం అనేది అంతకుముందు ఫాల్కన్ పోంజీ కేసు ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందినది. అయితే అమర్‌దీప్ నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.792 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ తేల్చింది. దర్యాప్తులో భాగంగా ఈ విమానాన్ని గత మార్చి 7న ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత.. చట్టపరమైన ప్రక్రియ ద్వారా, పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతితో దీనిని ఈ-వేలంలో రూ.3 కోట్లకు విక్రయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -