- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల తరఫున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆరోపించారు.17 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పినా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయడం లేదని,వేలాది పోలీస్ ఉద్యోగాలు వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్నికల ముందు యువతకు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేస్తున్నదని విమర్శించారు.అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా ఉద్యోగాలు వేయడం లేదని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
- Advertisement -



