Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ నాగన్నకు విప్లవ జోహార్లు

కామ్రేడ్ నాగన్నకు విప్లవ జోహార్లు

- Advertisement -

– అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఇరుగు నాగన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 
: అరుణోదయ కామ్రేడ్ నాగన్న జోహార్లు అంటూ ఆయన చిత్రపటానికి అంబేద్కర్ సెంటర్లో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు శనివారం అర్పించినట్లు పివైఎల్ రాష్ట్ర కమిటీ నాయకుడు కామ్రేడ్ ఇరువు అనిల్ తెలిపారు.పెత్తందారుల చేతులలో దళిత,బహుజన వర్గాలుఎన్నో అవమానాలతో ప్రతినిత్యం ఎలా నలిగిపోతున్నారో, గాయపడుతున్నారో నాగన్న చూసాడు. వీటికి నాగన్న కూడా గురైయ్యాడు. ఇందుకు ఏమి చేయాలని తాను మధన పడ్డాడు. మనసులో రగిలిన ఈ ఆలోచనలు, ఎర్రజెండా రెపరెపలు తన గుండెకు హత్తుకున్నాయి. ఎర్రజెండా నీడలో  తన కంఠాన్ని పదును పెట్టాడు. అదేక్రమంలో కమ్యూనిస్టులు పాటలు పాడుతూ  గ్రామా లకి వచ్చే ప్రజలను చైతన్యపర్చారు. దీనితో నాగన్న ప్రజా ఉద్యమ బాట పట్టి  ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తిని అన్నారు.ఈ కార్యక్రమంలో కానకు బాలు రాజు లేదు లెనిన్ ప్రవీణ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -