- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. మమతకు అత్యంత సన్నిహితురాలు, పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య టీఎంసీకి రాజీనామా చేశారు. పార్టీకి చెందిన అన్ని పదవులకు శనివారం రాజీనామా చేశారు. ఇకపై పార్టీకి పూర్తి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. టీఎంసీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు, కాలిఘాట్‌లో మమతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రిమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన అంశాల్లో తన పేరును ప్రస్తావించకూడదని, మమత తరఫున తనను సంప్రదించకూడదని కూడా చంద్రిమ.. ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే, తన రాజీనామాకు గల కారణాన్ని చంద్రిమ వెల్లడించలేదు.
- Advertisement -



