Saturday, July 4, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులకు ఆమోదం

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులకు ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షతన, మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ విస్తరణ, పక్కా డ్రైనేజీ నిర్మాణం, సుందరీకరణ పనులు చేపట్టడంతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో మురుగునీటి పారుదల సమస్యల పరిష్కారానికి అవసరమైన కల్వర్టుల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 మార్గదర్శకాల మేరకు పట్టణ పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రానున్న వన మహోత్సవం–2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మొక్కల కొనుగోలు, మొక్కలు నాటేందుకు కార్మికుల నియామకం, మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డుల కొనుగోలు తదితర పనులకు సంబంధించిన తీర్మానాలను కూడా సమావేశం ఆమోదించింది.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు, పర్యావరణ పరిరక్షణ, పట్టణ సుందరీకరణ లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది.

ఈ సమావేశంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ వేముల సురేష్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -