నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ చందా నరేష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్సై గంగారపు కర్ణాకర్, ఎం ఆర్ సి కార్యాలయంలో ఎంఈఓ ఆంగోతు రాందాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వీరస్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమ్య ఎస్బిఐ బ్యాంక్ లో హరీష్, పశు వైద్యశాలలో వైద్యాధికారి సోమ శ్రీనివాస్ గ్రంథాలయంలో వెంకన్న మండల కేంద్రంలో సర్పంచ్ పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రత్నం యాకన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరపాటు వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి, ఐకెపి వెలుగు కార్యాలయంలో మయూరి మండల సమైక్య అధ్యక్షురాలు తళ్ళ సునీత మండలంలోని యాయా గ్రామా పంచాయితీ పరిధిలో సర్పంచ్ లు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో వారి సిబ్బందితో కలిసి జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటి శ్రీనాథ్ ఆర్ ఐ రామకృష్ణ ఎంపీడీవో సూపర్డెంట్ నరసింహారావు తోపాటు కొంతమంది పాల్గొన్నారు.
కార్యాలయాల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



