ఉట్టి కొట్టే పోటీల్లో చిన్నారులు, యువత సందడి
నవతెలంగాణ – కాటారం (మహాదేవ్ పూర్ )
రేగులగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పాగే ఆమని–సురేష్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువజన సభ్యుల సహకారంతో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు, పెద్దలకు వేర్వేరుగా ఉట్టి కొట్టే పోటీలు నిర్వహించారు. చిన్నారుల విభాగంలో ఉత్సాహంగా పాల్గొన్న చల్ల రిత్విక్ (S/o చల్ల రాజబాబు) విజేతగా నిలిచాడు. అతడికి గ్రామ యువజన సభ్యుల ఆధ్వర్యంలో రూ.1,000 నగదు బహుమతి అందజేశారు.
పెద్దల విభాగంలో ఉట్టి కొట్టే పోటీలో ఐలి రాజకుమార్ (S/o ఐలి వాసు) ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. విజేతకు సర్పంచ్ దంపతులు పాగే ఆమని–సురేష్ చేతుల మీదుగా రూ.5,000 నగదు బహుమతి అందజేశారు.
అదేవిధంగా రాధ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బొద్దున శివశ్రీ (S/o బొద్దున రమేష్) ను సర్పంచ్ సురేష్ అభినందించి రూ.500 నగదు బహుమతి అందించారు.
వేడుకల్లో చిన్నారులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రేగులగూడెంలో పండుగ సందడి నెలకొంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సభ్యులు, గ్రామస్తులకు సర్పంచ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు
రేగులగూడెంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



