నవతెలంగాణ-మల్హర్ రావు : కాటారం మండలం మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేసి, విడిసి ఏర్పాటు, సభ్యుల ఎంపిక, తీర్మానాలపై వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గొట్టం భూమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు గ్రామసభ నిర్వహించకుండా విడిసి ఏర్పాటు చేశారనే ఆరోపణలు, ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులను కమిటీలో చేర్చారనే అభ్యంతరాలు, తీర్మానాలు–సంతకాలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు. గ్రామసభ నిర్వహించి,స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో నూతన విడిసి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.విచారణ పూర్తయ్యే వరకు పనులు కొనసాగిస్తే జిల్లా స్థాయిలో ఆందోళనను ఉధృతం చేసి, అవసరమైతే ఐటిడిఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపడతామని గొట్టం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుంటి లక్ష్మణ్, మేడిపల్లి గ్రామ అధ్యక్షులు బోధ ఓదెలు,గ్రామ యువకులు గాదె మహేష్, మాజీ సర్పంచ్ చింతల సుధాకర్ పాల్గొన్నారు.
విడిసి ఏర్పాటుపై విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



