Saturday, September 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

- Advertisement -

అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు
కొడంగల్‌ నియోజకవర్గంలో క్ష‍ేత్ర స్థాయిలో పరిశీలన
​ఎడ్యుకేషన్ హబ్‌‌లో పనుల తనిఖీ
మద్దూరులో డిగ్రీ కళాశాల పనుల పరిశీలన
హకీంపేట ఎడ్యుకేషన్‌ హబ్‌‌లో పనులను త్వరగా పూర్తి చేయాలి
నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతలపై చొరవ తీసుకోవాలని సూచన

కొడంగల్‌ నియోజకవర్గంలో 
సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-బొంరాస్ పేట్/ కొడంగల్‌/ దామరగిద్ద
​ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. సమీక్షించారు. హకీంపేట ఎడ్యుకేషన్‌ ‌హబ్‌‌లో పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పనులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఆ ప్రాజెక్టుకు సరిపడా నిధులు కేటాయి స్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌‌రెడ్డి ముందుగా నారాయణపేట జిల్లా మద్దూరుకు వెళ్లి… ఆ తర్వాత దౌల్తాబాద్ మండలం, దుద్యాల మండలంలోని హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు.

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ.. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ వైద్య, వెటర్నరీ, నర్సింగ్, ఫిజియో థెరపీ, పారామెడికల్, ఇంజినీరింగ్ కాలేజీ, 430 పడకల ఆస్పత్రితోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూల్ భవనాలు, హాస్టళ్ల భవన సముదాయాలను పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో జరిగే అన్ని నిర్మాణాల విషయంలోనూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాల విషయాల్లో ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల సమయంలో నీరు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌ను ఏర్పాటు చేయాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి ల్యాండ్‌స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష
నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత సమీక్షా సమావేశంలో సీఎం సూచనలకు అనుగుణంగా మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ ల పనులను ముందుకు తీసుకెళుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. శుక్రవారం రాత్రి కొడంగల్‌‌లోనే సీఎం బస చేయనున్నారు. శనివారం కూడా కొడంగల్‌‌లో సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మద్దూరులో అభివృద్ధి పనుల పరిశీలన
నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలలు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -