Saturday, September 5, 2026
E-PAPER
Homeక్రైమ్డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా

డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా

- Advertisement -


డ్రైవర్‌ మృతి.. ప్రయాణికులకు గాయాలు
బాధితులకు జుక్కల్‌ ఎమ్మెల్యే, 
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలో ఘటన
నవతెలంగాణ-బిచ్కుంద

​డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి జిల్లా బిచ్కుందకు వస్తోంది. జుక్కల్‌ మండలంలోని జుక్కల్‌ చౌరస్తా-కేమ్రాజ్‌ కల్లాలి చౌరస్తా మధ్యన జాతీయ ప్రధాన రహదారిపై బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ఆంజనేయులు(50) ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కండక్టర్‌ బీరప్పతోపాటు 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, జుక్కల్‌ ఎస్‌ఐ మురళి వారిని వెంటనే అంబులెన్స్‌లో బిచ్కుంద ప్రభుత్వాస్పత్రికి తరలించారు.స్వాతి, బీరప్ప, రితిక్‌ (జుక్కల్‌ మండలం హంగర్గా), సనాబాయి (మహ్మదాబాద్‌), సాయిలు(బూరుగుపల్లి), సాయిలు(మిర్జాపూర్‌), గంగాధర్‌ (చిల్లర్గి), యమునాభారు (మద్నూర్‌ మండలం థనూర్‌), భీమ్‌రావు, అనురాధ (చిన్నఏక్లారా), దిగంబర్‌రావు (సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం గరుడేగావ్‌), అనురాధ, సంగ్రామ్‌, చైత్ర (సిర్గాపూర్‌)కు గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జుక్కల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
​పరామర్శించిన జుక్కల్‌ ఎమ్మెల్యే
బస్సు ప్రమాదంలో గాయపడి బిచ్కుంద ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరామర్శించారు. డ్రైవర్‌ ఆంజనేయులు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. చికిత్స అందుకుంటున్న కండక్టర్‌ బీరప్పతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
​మాజీ ఎమ్మెల్యే పరామర్శ..
గాయపడిన వారిని జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే హనుమంత్‌షిండే పరామర్శించారు. ఆయన వెంట నాయకులు వెంకట్రావు దేశారు, బొల్లి గంగాధర్‌, నాల్చర్‌ రాజు, పిట్ల సాయిలు, వాసరే రమేష్‌, రాజు పటేల్‌, హాజీ లక్ష్మణ్‌ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -