Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రైమ్‌ కేర్‌ 
‌ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి

ప్రైమ్‌ కేర్‌ 
‌ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -


శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి
నిందితుడిని కఠినంగా శిక్షించాలి :
ఐద్వా రాష్ర్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి
ఆస్పత్రి ఎదుట నిరసన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

​నర్సు శిరీషను హత్య చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని, ఉద్యోగుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రి యాజమాన్యంపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ర్ట అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఆర్‌. ఆరుణజ్యోతి, మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. నర్సు శిరీషకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ.. రంగారెడ్డి జిల్లా తుక్కుగుడ ప్రాంతంలోని ప్రైమ్‌ ‌కేర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కనీస భద్రత పట్ల యాజమాన్యాల నిర్లక్ష్యం ఉందని విమర్శించారు. నర్సుల వసతి గృహాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలూ లేవన్నారు. మహిళా ఉద్యోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే, ఆ బాధత్యను కూడా నిర్ధారించి, సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. శిరీష హత్యకు కారణమైన నిందితుడిని ఫాస్ట్‌‌ట్రాక్‌ ‌కోర్టు ద్వారా విచారించి, కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ర్టంలో అన్ని ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో మహిళా ఉద్యోగుల భద్రతా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠిన తరం చేయాలన్నారు. మహిళపై హింసకు ప్రోత్సహించే మద్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, అశ్లీల కంటెంట్‌ ‌వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్‌. అశాలత, రాష్ర్ట కమిటీ సభ్యురాలు మస్కు అరుణ, రంగారెడ్డి జిల్లా సభ్యులు సంధ్య, సంతోష, తదితరులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -