Saturday, July 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమరుల త్యాగలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

అమరుల త్యాగలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

- Advertisement -


నవతెలంగాణ-దేవరుప్పుల: 30 ఏళ్ల జిఎంపిఎస్ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి అమరుల త్యాగాలు పరవలేనివని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా.. జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన “అమరుల యాదిలో స్ఫూర్తి యాత్రను” ఆయన ప్రారంభించారు. అంతకముందు మొదట దొడ్డి కోమురయ్య స్థూపానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గత 30 సంవత్సరాల నుండి ఈ సంఘంలో సేవలు అందించి అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలను కలిసి పరమర్శించడం కోసం చేపట్టిన యాత్ర అభినందనీయమన్నారు. వారి త్యాగాలను మరవకుండా వారి ఆశయ సాధనకు ముందుకు తీసుకపోవడానికి కృషి చేయడంలో భాగమే ఈ కార్యక్రమం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 40 మంది అమరవీరులను గుర్తించి ఎనిమిది రోజులపాటు వీరి కుటుంబ సభ్యులందరినీ కలిసి వారి సేవలను కొనియాడి వారి పోరాటాలను నెమరేసుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. సమసమాజ స్థాపనకు భవిష్యత్తులో యువత ముందుకు రావాలని ఇలాంటి కార్యక్రమాలతో చైతన్యవంతమై స్ఫూర్తిని తీసుకొని యువత ముందుకు వచ్చే అవకాశం ఉందని యువత ముందుకు వస్తే సమాజ మార్పులో కీలకంగా పనిచేస్తారని నాటి దొడ్డి కొమరయ్య అమరత్వం అదేవిధంగా జి.ఎం.పి.ఎస్ లో పని చేసిన నాయకుల అమరత్వం అందుకు నిదర్శనం అని కొనియాడారు.

కడవెండి గ్రామంలో నక్క లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మాట్లాడుతూ కడవెండి గ్రామంలో నక్క లింగయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక గొర్రెల మేకల పెంపకం దారులకు సేవలు అందించిన నాయకుడు లింగయ్య అని వారు కొనియాడారు. గ్రామంలో దుబ్బగుట్ట పోరాటం లో అనేక నిర్బంధాలు ఎదుర్కొని, గ్రానైట్ కంపెనీ నుండి గుట్టను కాపాడి విజయం సాధించినటువంటి పోరాటంలో ముందుండి పోరాటం నడిపిన నాయకుడు లింగయ్య అని ఆ పోరాటంలో 22 మంది పైన కేసులైన కూడా వదిలిపెట్టకుండా విజయం సాధించిన ఘనత గ్రామ సొసైటీ అధ్యక్షునిగా లింగయ్యదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్, బృందం సభ్యులు జిఎంపిఎస్ రాష్ట్ర నాయకులు బొల్లం అశోక్, కడెం లింగయ్య, చల్ల మల్లయ్య వజ్జే వినయ్, జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు సాదం రమేష్ అధ్యక్షులు మోటి దేవేందర్ జిల్లా కార్యదర్శి బాలరాజు, జిగారి యాదగిరి, మండల అధ్యక్ష, కార్యదర్శులు భూమండ్ల కుమారస్వామి, ముక్కెర గంగరాజు, నక్క లింగయ్య కుటుంబ సభ్యులు నక్క కొమరయ్య ఉపసర్పంచ్ రేణుక, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -