- Advertisement -
- – కొట్ర సర్పంచ్ శారద చెన్నయ్య..
నవతెలంగాణ – వెల్దండ
కొట్ర గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని కొట్ర సర్పంచ్ శారద చెన్నయ్య అన్నారు. సోమవారం వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిధుల ద్వారా 15 లక్షలతో నూతనగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణాన్ని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో గ్రామ సమస్యలు ఒక్కటిగా పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నమ్మ , వార్డు సభ్యులు సాయి యాదవ్ , సత్యం , మల్లేష్, గ్రామ నాయకులు మల్లయ్య , రాజు యాదవ్ , వెంకయ్య, మధు, అల్లాజీ, శివ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



