Tuesday, March 3, 2026
E-PAPER
Homeసినిమాఫీల్‌గుడ్‌ లవ్‌ సాంగ్‌ 'ప్రేమ ఓ ప్రేమ'

ఫీల్‌గుడ్‌ లవ్‌ సాంగ్‌ ‘ప్రేమ ఓ ప్రేమ’

- Advertisement -

వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్‌ కంప్లైంట్‌’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ – నవీన్‌ చంద్ర జంటపై చిత్రీకరించిన బ్యూటీఫుల్‌ మెలోడియస్‌ సాంగ్‌ ‘ప్రేమ ఓ ప్రేమ’ అనే పల్లవితో సాగే ప్రేమ గీతాన్ని సీనియర్‌ జర్నలిస్టు ప్రభు లాంచ్‌ చేశారు. ఈ పాట అన్విక ఆడియోస్‌ ద్వారా రిలీజ్‌ అయింది. ఈ పాటకు సుధాకర్‌ మారియో సంగీతం సమకూర్చారు. ఈ పాట యూత్‌కు బాగా నచ్చుతుందని, ట్రెండింగ్‌గా నిలిచిపోతుందని, సూపర్‌ హిట్‌ లవ్‌ సాంగ్స్‌ల్లో ఈ పాట కూడా చోటు దక్కించుకుంటుందని దర్శకుడు సంజీవ్‌ మేగోటి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. హర్రర్‌ థ్రిల్లర్‌, అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలిపారు.

యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్‌, పృథ్వి, శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, తదితరులు నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఎస్‌.ఎన్‌. హరీష్‌ సినిమాటోగ్రఫీ, డ్రాగన్‌ ప్రకాష్‌-రవితేజ ఫైట్స్‌ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌: కె.వి. రమణ, ఎడిటర్‌: అనుగోజు రేణుకా బాబు, సంగీతం: ఆరోహణ సుధీంద్ర – సంజీవ్‌ మేగోటి – సుధాకర్‌ మారియో, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: సంజీవ్‌ మేగోటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -