Monday, July 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలువెంకటేశ్‌, కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ నుంచి ఫస్ట్ లుక్..దర్శకుడు భావోద్వేగ పోస్ట్

వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ మల్టీస్టారర్ నుంచి ఫస్ట్ లుక్..దర్శకుడు భావోద్వేగ పోస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కల్యాణ్ రామ్ పూర్తి సంప్రదాయ గెటప్‌లో పంచెకట్టుతో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా కల్యాణ్ రామ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. “నా మొదటి సినిమా ‘పటాస్’కు అవకాశం ఇచ్చి, ఒక కొత్త దర్శకుడిని నమ్మిన నా మొదటి హీరో, నా బెస్ట్ బడ్డీ కల్యాణ్ రామ్‌కు థ్యాంక్స్. ఈ సినిమాలో ఆయన్ను కొత్త అవతారంలో చూపించబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది” అని పేర్కొన్నారు. అంతేగాక‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి పండుగకు థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -