100 మంది బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక
నవతెలంగాణ-కుభీర్
కుభీర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతోంది. పల్సి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీరాముల-కవిత రాజేష్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన కుభీర్ లో సుమారు 100 మంది బీజేపీ కార్యకర్తలు ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగానే ఇతర పార్టీలు బీజేపీ, బిఆర్ఎస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవలతో ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, కాంగ్రెస్ విజయానికి కట్టుబడి పనిచేస్తామని వెల్లడించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సాయినాథ్, నరసింహ, దేవేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాములు, మాజీ జెడ్పిటిసి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్, నాయకులు విజయ్ కుమార్ సూది రాజన్న మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



