Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు పరిధిలో కాకతీయ నగర్, సాయి సద్గురు కాలనీ, ఎన్జీవోస్ కాలనీలలో వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్ఓలకు ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఫారాలను అందించి, నిర్ణీత గడువులోగా వాటిని సేకరించాలని సూచించారు. ఓటర్లు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి బీఎల్ఓలకు అందించాలని ఆమె కోరారు. ప్రతి ఇంటికి చేరుకొని ఎస్‌ఐఆర్ (SIR) ఫారాలను పంపిణీ చేసి ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ రెడ్డి, బీఎల్ఓలు శ్యామల, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -