- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనంతవాణి (32) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె, తల్లి అనారోగ్యంగా ఉండటంతో స్వగ్రామానికి వచ్చి వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ శ్యామ్‌బాబుతో పరిచయం ప్రేమగా మారింది. అతడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిన తర్వాత ఆమె దూరం పెట్టినట్లు సమాచారం. దీంతో కోపంతో ఉన్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



