Monday, July 6, 2026
E-PAPER
Homeఆటలుఇదే నా చివరి ప్రపంచకప్: క్రిస్టియానో రొనాల్డో

ఇదే నా చివరి ప్రపంచకప్: క్రిస్టియానో రొనాల్డో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌పై ఒక కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంటే తన కెరీర్‌లో చివరిదని ఆయన స్పష్టం చేశాడు. స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భవిష్యత్తు ప్రణాళికలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు.

ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ.. “ఈ ప్రపంచకప్‌ను వీలైనంత ఎక్కువగా ఆస్వాదించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే నా చివరి ప్రపంచకప్. అయితే, రేపటి మ్యాచే ఈ టోర్నీలో నా చివరి గేమ్ కాకూడదని ఆశిస్తున్నాను” అన్నాడు. 41 ఏళ్ల రొనాల్డోకు ఇది ఆరో ప్రపంచకప్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గోల్స్ సాధించాడు. వీటిలో ఒకటి నాకౌట్ దశలో చేసినదే. తన సుదీర్ఘ కెరీర్‌లో ప్రపంచకప్‌లలో మొత్తం 11 గోల్స్ నమోదు చేశాడు.

రిటైర్మెంట్‌పై పదేపదే ప్రశ్నలు అడగవద్దని మీడియాను కోరాడు. “నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటే అప్పుడే అవుతాను. మీరు కోరుకున్నప్పుడు కాదు. ఈ ప్రశ్న అడగడం సమయం వృథా. నా దృష్టి మొత్తం రేపటి మ్యాచ్‌పైనే ఉంది” అని స్పష్టం చేశాడు. జట్టు పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, “జట్టుకు సహాయం చేయడానికి నేను ఎప్పుడూ నా శరీరం, ఆత్మతో కట్టుబడి ఉంటాను. నేను ఆడుతున్నానా? లేదా? అన్నది ముఖ్యం కాదు. నా పాత్ర ఎప్పుడూ కీలకమే” అని వివరించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -