- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాలకిషన్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినం సందర్భంగా రావి ఆకుపై ఎమ్మెల్యే చిత్రం వేసి వినూత్నంగా జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఈ చిత్రాన్ని ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాస బాల్కిషన్ ను అభినందించారు.
- Advertisement -



