Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై ప్రత్యేక దృష్టి: తహశీల్దార్

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై ప్రత్యేక దృష్టి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ -దర్పల్లి
ఓటరు జాబిత సమగ్ర సవరణ ప్రక్రియను తహశీల్దార్ శాంత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సర్ పై ఎన్యూమరేషన్ సిబ్బందికి పలు సూచనలు ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్ఒలను ఆదేశించారు. సోమవారం ఆమె ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రకియలో భాగంగా అన్ని గ్రామాల్లో పర్యటించారు. తప్పులు లేకుండా ఫారాలు నింపాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిరక్షరాశులకు ఫారాలు సక్రమంగా నింపి ఇవ్వాలని ఎన్యూమరేటర్ లకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు చదువుకున్న యువత సహకరించాలని కోరారు. కార్యక్రమములో ఆర్ ఐ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -