Monday, August 17, 2026
E-PAPER
Homeఖమ్మంగ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– రేపు, ఎల్లుండి ఎంపీడీవో కార్యాలయాల వద్ద దీక్షలను జయప్రదం చేయండి 
– సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు 
నవతెలంగాణ – సత్తుపల్లి

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో రేపు (మంగళవారం),  ఎల్లుండి (బుధవారం) రెండు రోజుల పాటు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట జరిగే నిరసన దీక్షలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు కోరారు. ​పెనుబల్లి మండల కేంద్రంలో సోమవారం జి. వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన యూనియన్ ముఖ్య బాధ్యుల సమావేశంలో విఠల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత 40 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో గ్రామపంచాయతీ కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ​ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘మల్టీపర్పస్’ విధానం వల్ల ఒకే కార్మికుడు అన్ని రకాల పనులు చేయాల్సి వస్తోందని, దీనివల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ‘మల్టీపర్పస్’ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ​అలాగే జీవో నంబర్ 51ని సవరించి, గ్రామపంచాయతీ వర్కర్లందరికీ ప్రతినెల 5వ తేదీ లోపే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల ముందు చేపట్టే ఈ ధర్నా  కార్యక్రమాల్లో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు రామారావు, కిషోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -