Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయం కోసం నాలుగోసారి ప్రజావాణిలో ఫిర్యాదు

న్యాయం కోసం నాలుగోసారి ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
1990 సంవత్సరంలో కొనుగోలు చేసిన తొమ్మిది గుంటల భూమిలో గత 36 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నామనీ, మా భూమిని స్తానిక సురేష్ గౌడ్ అతని తమ్ముళ్లు కలిసి దౌర్జన్యంగా గెట్లను తొలగించి, కబ్జాకు పాల్పడ్డారని సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదుదారుడు సందూర్‌ వార్‌ హనుమండ్లు నాలుగోసారి వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు మాట్లాడుతూ..మద్నూర్ గ్రామ శివారు పరిధిలోని మైసమ్మ చెరువు కింద తన 9 గుంటల పొలం ఆక్రమణకు గురైందని ఆవేదన చెందారు. ఇప్పటికీ మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, దీని గురించి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. న్యాయం కోసం నేడు నాలుగోసారి 22 శాఖల అధికారుల సమక్ష‍ంలో జరుగుతున్న ప్రజావాణిలో మళ్ళీ ఫిర్యాదు చేశామనీ, ఇప్పటికైనా అధికారులు తమ సమస్యపై దృష్టి సారించి, న్యాయం చేయాలనీ వేడుకున్నారు. లేనియెడల కుటుంబ సమేతంగా న్యాయం కోసం నిరాహార దీక్ష చేపడతామనీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -