Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై సర్పంచ్, కార్యదర్శి విచారణ

జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై సర్పంచ్, కార్యదర్శి విచారణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం భర్త మరణించిన వితంతువులకు(ఎన్.ఏప్.బి.ఎస్)జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి రూ.20 వేలు ప్రయోజనం అందించే నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన మడక లక్ష్మీ భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆమె ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకొన్న క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు భర్త మరణించిన వితంతు మహిళలు ఎవరైనా సరే 18 నుంచి 59 సంవత్సరాల లోపు,12-42017 తరువాత చనిపోయిన వారు, వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, ఆధార్, రేషన్, మరణ దృవీకరణ పత్రం జత చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో ఆపద్బాంధవ పథకం కింద ప్రయోజనం పొందని వారు మాత్రమే అర్హులైన వారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -