నవతెలంగాణ-కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మండల ఎంపీడీవో అష్టం భీమేష్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఆయా శాఖలకు చెందిన అధికారులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ గ్రామల్లో ఉన్న సమస్యలను, ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, తదితర సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
దీంతో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. దింతో మొదటి రోజున వివిధ సమస్యలతో ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ దరఖాస్తులను సంబంధించిన అధికారులకు అందజేసి వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ప్రజలను సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి మండల విద్యాధికారి విజయ్ కుమార్, వీబిజి రాంజీ ఏ పీఓ హరిలాల్, ఇందిరా క్రాంతి ఏ పిఎమ్ దత్తత్రి, విద్యుత్ శాఖ అధికారి కదం ఆదిత్య, వ్యవసాయ శాఖ మండల అధికారి సారిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజేష్, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు ఉన్నారు.



