Monday, August 17, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి ప్రజావాణిలో 'అర్జీల' వెల్లువ

సత్తుపల్లి ప్రజావాణిలో ‘అర్జీల’ వెల్లువ

- Advertisement -

– వినతులను స్వీకరించిన అధికారులు
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 46 విజ్ఞాపన పత్రాలు అందాయి. ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పున్నం సత్యనారాయణ, కమిషనర్ కోండ్ర నరసింహ, ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి యరపతినేని శ్రీనివాసరావు, వైద్యాధికారి రామిశెట్టి అవినాష్, విద్యుత్ శాఖ ఏఈ ఉబ్బన శరత్ బాబు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -