Monday, July 6, 2026
E-PAPER
Homeజాతీయంఆరు కిలోల బరువు తగ్గిన సోనమ్‌ వాంగ్‌చుక్‌

ఆరు కిలోల బరువు తగ్గిన సోనమ్‌ వాంగ్‌చుక్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తు కాక్రోచ్‌ జనతా పార్టీ (Cockroach Janata Party) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో చేపట్టిన నిరసనలు సోమ‌వారం 17వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్ష 9వ‌ రోజుకు చేరుకుంది. దీంతో ఇప్పటిదాకా ఆయన ఆరు కిలోల బరువు తగ్గారు.

వాంగ్‌చుక్‌ రక్తపోటు 112/70కు, హృదయ స్పందన నిమిషానికి 72, బ్లడ్‌ షుగర్‌ స్థాయి 67గా నమోదైందని ఆరోగ్య బులెటిన్‌ పేర్కొంది. నీట్‌ పేపర్‌ లీకేజీతో తీవ్ర ఆందోళనతో రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుందని, ఆర్మీ రిటైర్డు ఉద్యోగి ఆమె తండ్రి ఆదివారం నిరసనలో పాలుపంచుకున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో పేర్కొన్నారు. తమ ఆవేదన మరే కుటుంబానికి రాకూడదని ఆయన కోరుకుంటున్నారని, కేంద్రమే దీనిపై భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా దీప్కే పేర్కొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -