Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం

ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతి పరిధిలో సోమవారం గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ  ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మొక్కలు పంపిణీ చేసి,ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కైన నాటి సంరక్షించాలని అవగాహన కల్పించారు.”ఒక్క మొక్క లక్ష ప్రాణాలకు ఆధారం”,”మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం”,”భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందిద్దాం” అని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొగాకు సైదులు, ఫీల్డ్ అసిస్టెంట్ సలీవోజు యాదయ్య,వార్డు సభ్యులు పగిల్లా శంకర్,పగిల్లా వంశీ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -