మూడు దేశాల పర్యటనలో భాగంగా
ఇండోనేసియాలో ప్రధాని
ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యంపై చర్చ
జకార్తా : మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ సోమవారం రోజు ఇండోనేసియా రాజధాని జకార్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఇండోనేసియా అధ్యక్షుడి ఆత్మీయ ఆతిథ్యానికి స్పందించిన ప్రధాని మోడీ..స్వయంగా ప్రబోవో తనను విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడం ఎంతో హత్తుకుందని తెలిపారు. ఈ పర్యటనలో భారత్- ఇండోనేసియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలు చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు.2018లో భారత్- ఇండోనేసియా సంబంధాల్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాం. ఆ భాగస్వామ్యం రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోంది’ అని పోస్టులో పేర్కొన్నారు.
జకార్తాలో మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



