ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టిలకు వేతనాలు ఇవ్వాలి..

– టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు  కొర్ర శంకర్ 
నవతెలంగాణ – అచ్చంపేట:  గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న  సి ఆర్ టి లకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు  కొర్ర శంకర్ డిమాండ్ చేశారు. టి ఎస్ యు టి ఎఫ్ పదర మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ పాఠశాలలకు (ఆశ్రమ స్కూల్ ఉడిమిళ్ళ, ఎం పీ యు పి ఎస్ చిట్లంకుంట, జడ్పీహెచ్ఎస్ వంకేశ్వరం, జడ్పీహెచ్ఎస్ పదర, కేజీబీవీ రాయల గండి) సందర్శించి 40 సభ్యత్వాలను చేయించమని తెలిపారు. ఈ సందర్భంగా  కొర్ర శంకర్ గ మాట్లాడుతూ  కొత్తగా ఏర్పడిన  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను మేనిఫెస్టో చెప్పిన విధంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు, కేంద్ర ప్రభుత్వము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆర్ రామ్చంద్రు , మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే. జవహర్లాల్ , బిక్కు రాథోడ్, మండల ఉపాధ్యక్షులు ఎం గోపి సింగ్, మండల గౌరవ అధ్యక్షులు పుల్లయ్య  శివానంద చారి, ఆంజనేయులు, కే జవహర్లాల్, ఎన్ శ్రీను, కృష్ణవేణి ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love