Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయం12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి..మమతా బెనర్జీ భారీ ఆందోళన

12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి..మమతా బెనర్జీ భారీ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత పశ్చిమబెంగాల్‌లో 12 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాలిక తన స్నేహితురాలికి బర్త్‌ డే గిఫ్ట్‌ కొనేందుకు బయటకొచ్చింది. ఆ టైమ్‌లో నలుగురు యువకులు ఆమెను ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆమె తలపై బండరాయితో కొట్టి సామూహిక అత్యాచారం చేశారు.ఈ నేపథ్యంలో కలకత్తాలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకుండా తనను నివాసానికే పరిమితం చేశారని రాష్ట్ర పోలీసులపై TMC నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. శనివారం బాలిక మృతితో ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -