దుబ్బాక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆస యాదగిరి
నవతెలంగాణ – మిరుదొడ్డి
నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ దుబ్బాక కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయించడం పట్ల ఆయన కృషిని అభినందనీయమని. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఆస యాదగిరి పత్రిక ప్రకటనలో తెలిపారు. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికై నిధులను మంజూరు చేయవలసిందిగా వినయపూర్వకంగా విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగింది. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గం దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తక్షణమే మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇవ్వడం పట్ల దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.
అంతేగాక దుబ్బాక మున్సిపాలిటి లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తో పాటు హబ్సిపూర్ టు దుబ్బాక వరకు ఫోర్ లైన్స్ రోడ్లు మంజూరు చేయవలసిందిగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించవలసిందిగా ఆయన కోరారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు బాల బాలికల భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు అని విద్యా వైద్యంలో ముందు. చూపూతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సీఎం ఒప్పించి మంజూరు చేయించడం పట్ల ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. 200 కోట్లతో నిర్మితమయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలను మంజూరు పట్ల ప్రత్యేకత చొరవ కనబరిచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కి అందుకు సహకరించిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కి దుబ్బాక నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



