నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేబల్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామంలో రోడ్ సైడ్ ప్లాంటేషన్ పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ చాకలి కృష్ణ బుధవారం పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలు ఉపాధి హామీ పథకంలోని నర్సరీల్లో పెంచిన మొక్కజొన్న నాటెందుకు గుంతలు తీశారు. గతంలో నాటిన మొక్కలు నేడు పెరిగి మహా వృక్షాలు వృద్ది చెందాయని స్థానికులు తెలిపారు. పెరుగుతున్న కొన్ని మొక్కలు చనిపోయాయని, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాదేందుకు గుంతలు ఏర్పాటు చేసి, ప్రస్తుతం పెంచుతున్న నర్సరీలోని మొక్కలను అక్కడ నాటుకోవాలని సంబంధిత ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు స్థానిక సర్పంచ్ చాకలి కృష్ణ మరియు ఉపాధి హామీ ఇస్ స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ సైడ్ ప్లాంటేషన్ గుంతలను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



