అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నాగార్జున మాట్లాడుతూ,’నందు ఈ కథ శ్రీరామపురంలో జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్న గుర్తొచ్చారు. నందు ఈ కథను అద్భుతంగా రాశారు. డైలాగ్స్ గొప్పగా ఉంటాయి. ఈ కథలో ఉండే పెయిన్‌ని అఖిల్ తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు. నేను నిర్మాతగా ఇందులోకి వచ్చాను కాబట్టి కథ విషయంలోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను. షూటింగ్ టైంలో పుటేజ్ చూపించారు. ఇదొక గొప్ప సినిమా అవుతుందని అప్పుడే అనుకున్నాను. ప్రతీ ఒక్క పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. భారతి పాత్ర (భాగ్యశ్రీ) ఈ సినిమాకి సోల్, హార్ట్ బీట్. ఎన్నో పాత్రలు, ఎన్నో లేయర్స్‌ని పెట్టి నందు గొప్ప కథను రాసుకున్నారు. వాటికి తగ్గట్టుగా తమన్ అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. మేం తీసిన సినిమా ముందు మాకు నచ్చాలి. ఓటీటీల కోసం చిత్రాన్ని చేయలేదు.
అందుకే మేం సంతృప్తి అయ్యే వరకు ఆగాం. జూన్‌లోనే మా మూవీ రెడీగా ఉంది. ఇంకో రెండు వారాల టైం ఇవ్వండని టెక్నీషియన్లు అడిగారు. దాని వల్ల సినిమా ఇంకా ఎఫెక్టివ్‌గా వచ్చింది. నేను ఇంతగా ఇన్వాల్వ్ అయి చేసిన చివరి చిత్రం ‘మనం’. అది నాన్న గారి కోసం చేశాను. ఇప్పుడు నా కొడుకు కోసం ‘లెనిన్’ చేశాను. ఏ తండ్రి అయినా కొడుకు విజయం సాధించాలని కోరుకుంటాడు, కొడుకు సక్సెస్ అయితే తండ్రి సంతోషిస్తాడు’ అని అన్నారు. హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ,’‘మన మూలాలకు, తెలుగు ప్రేక్షకుల మూలాలకు దగ్గరగా ఉండేలా ‘లెనిన్’ కథ ఉంటుంది. ‘లెనిన్’ను కమర్షియల్ లెక్కల్లోంచి చూడలేదు. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ‘లెనిన్’ను నిజాయితీగా చేశాం. లెనిన్ పాత్రలోకి వెళ్లేందుకు నేను కష్టపడ్డాల్సి వచ్చింది. ఇందులో వయలెన్స్‌కి కూడా ఓ ఎమోషన్ ఉంటుంది. నందు గారు ఆర్గానిక్‌గా కథను రాశారు. మా కంటెంట్ మాట్లాడుతుం ది. మా సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. నేను, నందు కొత్త వారిలానే కలిసి ఈ మూవీకి పని చేశాం. జూలై 10న మా చిత్రంలోని ట్విస్టులు అన్నీ తెలుస్తాయ’ని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘లెనిన్’ సినిమాలో అఖిల్ కొత్తగా, ఇది వరకెన్నడూ కనిపించనట్టుగా కనిపిస్తారు. అదే మా మూవీకి ప్లస్ పాయింట్’అని చెప్పారు.
‘లెనిన్’నునిజాయితీగా చేశాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



