Thursday, July 9, 2026
E-PAPER
Homeబీజినెస్నెల కనిష్ఠానికి రూపాయి

నెల కనిష్ఠానికి రూపాయి

- Advertisement -


ముంబయి : అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడటంతో భారత రూపాయి విలువ బుధవారం దాదాపు నెల రోజుల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందని ప్రకటించడంతో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగి ఆసియా కరెన్సీలతో పాటు రూపాయిపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.6 శాతం బలహీనపడి 95.55 వద్ద ముగిసింది. ఇంట్రా ట్రేడింగ్ సమయంలో ఇది 95.60 వరకు పడిపోగా.. జూన్ 11 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -