నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని “మెరుగైన జ్ఞానం, మెరుగైన చర్మ ఆరోగ్యం” అనే ఇతివృత్తంతో జూలై 8న ప్రపంచం జరుపుకుంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడే కారకాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతోంది. కాలుష్యం వంటి బాహ్య కారకాల నుండి చర్మాన్ని రక్షించడంలో చర్మ సంరక్షణ కీలకపాత్ర పోషించినప్పటికీ, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడానికి మీరు మీ శరీరానికి పోషణను ఎలా అందిస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యం. అవసరమైన పోషకాలను అందించే సమతుల్య ఆహారం తీసుకోవడం, కాలిఫోర్నియా బాదంపప్పులు, తృణధాన్యాలు, మొక్కల మరియు జంతు ప్రోటీన్ వంటి చర్మానికి మేలు చేసే ఆహార పదార్థాలను కలిగి ఉండటం, దీనికి తోడు చురుకైన జీవనశైలిని అనుసరించడం ఆరోగ్యకరమైన చర్మానికి, మొత్తం శ్రేయస్సుకు దోహదపడుతుంది.
మీ చర్మం యొక్క రక్షణ పొర, పటుత్వం, పనితీరుకు మద్దతు ఇవ్వడంలో పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. కాలిఫోర్నియా బాదంపప్పులు అటువంటి ఒక సూపర్ ఫుడ్. ఇది సహజంగానే పోషకాలతో నిండి ఉంటుంది. ఇది బి విటమిన్లు, జింక్, రాగి మరియు అవసరమైన లినోలిక్ యాసిడ్‌తో సహా 24 పోషకాలను అందిస్తుంది, ఇవి సమిష్టిగా కణాలను రక్షించడంలో, చర్మ నిర్మాణానికి దోహదపడతాయి. వీటిలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని కాపాడి, పొడిబారడాన్ని బాదంపప్పులు నివారిస్తాయి. ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మానికి తోడ్పడే ఆహార ప్రణాళికను రూపొందించుకోవడానికి, వీటిని ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మరియు ఆకు కూరలతో పాటు చేర్చుకోండి.
మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే మీరు తినే ఆహారం గురించి అవగాహన కలిగి ఉండటమే అని మాక్స్ హెల్త్‌కేర్ – న్యూఢిల్లీకి చెందిన డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దార్ అన్నారు. ఆమె మాటాడుతూ , “మీరు తీసుకునే ఆహారమే తరచుగా మీ చర్మంలో ప్రతిబింబిస్తుంది. అందుకే, లోపలి నుండి ఆరోగ్యకరమైన చర్మానికి తోడ్పడే జీవనశైలి అలవాట్లపై దృష్టి పెట్టమని నేను నా క్లయింట్‌లను ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని శారీరక శ్రమ, సరైన హైడ్రేషన్ మీ చర్మానికి మరియు శరీరానికి పోషణ అందించడంలో కీలకమైనవి. నా క్లయింట్‌లు వారి ఆహారంలో చేర్చుకోవాలని నేను సిఫార్సు చేసే కొన్ని ఆహారాలలో తాజా పండ్లు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, కాలిఫోర్నియా బాదం వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల మూలాలు వంటివి వున్నాయి. విటమిన్ ఇ మరియు బయోటిన్ పుష్కలంగా ఉండే కాలిఫోర్నియా బాదం, ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు తోడ్పడతాయి. వీటిని సులభంగా అలాగే తినవచ్చు లేదా భోజనంలో భాగంగా చేసుకోవచ్చు, తద్వారా తీరిక లేని జీవితాలకు ఇవి ఆచరణాత్మక ఎంపికగా నిలుస్తాయి”అని అన్నారు.
న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ “ఆరోగ్యకరమైన చర్మం రాత్రికి రాత్రే ఏర్పడదు. ఇది కాలక్రమేణా తీసుకున్న సరైన ఆహార ఎంపికలు , ఇతర జీవనశైలి మెరుగుదలల ఫలితం. ఉదాహరణకు, ఉదయాన్నే గుప్పెడు బాదం పప్పులు తినడం. ఇవి విటమిన్ ఇ ని అందిస్తాయి. ఇవి చర్మం రంగుకు (పిగ్మెంటేషన్‌కు) మరియు చర్మ పునరుద్ధరణకు తోడ్పడే విటమిన్ ఇ ను అందిస్తాయి. మీ రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి వీటిని చియా సీడ్ పుడ్డింగ్, అసై బౌల్స్, ఓట్స్ లేదా రాగి జావ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఆహార విషయంలో తీసుకునే ఇటువంటి చిన్నపాటి, స్థిరమైన నిర్ణయాలు కాలక్రమేణా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో దోహదపడతాయి.. అని అన్నారు.
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ “ఒక నటిగా, ఎప్పుడూ నా పై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తూనే ఉంటారు. ఈ కారణముగా నా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక ప్రాధాన్యత అంశం. అందుకే, నాకు మరియు నా చర్మానికి ఉత్తమంగా అనిపించే జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నిస్తాను. నా భోజనం సాధారణంగా అధిక ప్రోటీన్‌తో కూడి ఉంటుంది. ఇందులో రకరకాల పండ్లు, కూరగాయలు ఉంటాయి. నేను నిద్రకు ప్రాధాన్యత ఇస్తూనే, ఒక క్రమబద్ధమైన వ్యాయామ దినచర్యను కూడా పాటిస్తాను. నేను ఎల్లప్పుడూ తగినంత నీరు తాగాలని గుర్తుంచుకుంటాను. ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత వరకూ దూరంగానే ఉంటాను. కాలిఫోర్నియా బాదం, తేలికపాటి సలాడ్‌లు లేదా వేయించిన మఖానా వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను. ఇవి నా చర్మానికి అత్యుత్తమంగా తోడ్పడటం తో పాటుగా ఒత్తిడితో కూడిన రోజులలో కూడా నా శక్తిని నిలబెడతాయి…” అని అన్నారు.
మెరుగైన అవగాహనతో, మన చర్మ ఆరోగ్యానికి ఉత్తమంగా తోడ్పడే ఆలోచనాత్మక నిర్ణయాలు మనం తీసుకోగలం. ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, మన చర్మానికి నిజంగా ఏమి అవసరమో సమగ్రంగా అర్థం చేసుకుని, ఆరోగ్యకరమైన చర్మానికి మరియు సంపూర్ణ శ్రేయస్సుకు దోహదపడే కాలిఫోర్నియా బాదంపప్పులను మన ఆహారంలో చేర్చుకోవడం వంటి సరైన నిర్ణయాలు తీసుకుందాం.



