- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా పరాకాష్ఠకు చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ఇరాన్‌పై బుధవారం రాత్రి అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయింది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడులు ప్రారంభించింది. టర్కీలోని అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు ముగిసిన అనంతరం ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌లోని పేలుళ్లకు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -



