- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వరుస భూకంపాలు సంభవించాయి. నాందేడ్, పర్భానీ, హింగోలి జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున 1:37 గంటల నుండి 3:23 గంటల మధ్య నాలుగు సార్లు భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై గరిష్టంగా 4.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం.
- Advertisement -



