- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గత ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆయన 14 నెలల మనవరాలు కూడా ఉంది. ఇదే దాడిలో ఖమేనీ కుమారుడు, ఇరాన్ ప్రస్తుత కొత్త సుప్రీం లీడర్ అయిన మోజ్తబా అలీ ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే నేడు ఖమేని అంత్యక్రియల వేళ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆనాటి దాడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.
- Advertisement -



