నవతెలంగాణ – ఆలేరు రూరల్
పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో గురువారం పశువులకు ముద్ద చర్మవ్యాధి (లంపీ స్కిన్ డిసీజ్) నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 125 పశువులకు ఎల్‌ఎస్‌డీ వ్యాధి నిరోధక టీకాలను అందించారు. పశువుల్లో ముద్ద చర్మవ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న టీకాల కార్యక్రమాన్ని ప్రతి పశుపోషకుడు సద్వినియోగం చేసుకోవాలని శారాజిపేట పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్ సూచించారు. పశువుల్లో జ్వరం, చర్మంపై గడ్డలు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రులు సుధాకర్, శ్రీకాంత్, గోపి, గ్రామ రైతులు పాల్గొని టీకాల కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.
పశువులకు ముద్ద చర్మవ్యాధి నివారణ టీకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



