అమల్లోకి విబీజీ రామ్ జీ
తగ్గిన కేంద్రం వాటా..
నవతెలంగాణ – మల్హర్ రావు
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉపాధి హామీ పథకం కొత్త రూపు సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ- రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అంగ్ అజీవికా మిషన్) పేరుతో ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. గతంతో పోలిస్తే కూలీలకు పని దినాలు పెరగడంతో పాటు వేతనం సైతం స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మండలంలో గ్రామాలుండగా 8,495 జాబ్ కార్డులున్నాయి. వీటి పరిధిలో 18,873 వెల మంది కూలీలు ఉండగా, పనులు చేసే వారు 10,632 మంది మాత్రమే. గత ఈజీఎస్ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని కల్పించగా, ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘వీబీ జీరామ్ జీ’ పథకంలో ఒక్కో కుటుం బానికి 125 రోజుల పనిదినాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రోజువారీగా కూలి రూ.307 ఉండగా, దానిని ఒక్క రూపాయి పెంచుతూ రూ. 308 చేసింది. గతంలో కేటాయించిన మొత్తం నిధుల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా కొనసాగగా,10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండేది. ప్రస్తుతం కొత్త పథకంలో 60 శాతం కేంద్రం వాటా కాగా, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది.
96,490 వేల పనిదినాలు..
జూలై నుంచి అమల్లోకి వచ్చిన ‘వీబీజీ రాంజీ పథ కంతో కూలీలకు పనిదినాలు గణనీయంగా పెరిగింది. మండలంలో 18,873 మంది ఉపాధి కూలీలుండగా..వారిలో 10,632 వేలు మంది మాత్రమే పనులు చేస్తున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. కాగా వీరికి ఏడాదికి ఒక్కో కుటుంబానికి 100 నుంచి 125 రోజుల పనిదినాలు పెంచారు. ఈ లెక్కన పాత పథకంతో పోలిస్తే ఓవరాల్ గా మండలానికి 10 వేల పనిదినాలు లభించగా కొత్త పథకంలో 96,490 పనిదినాలు వర్తిస్తోంది. ఈ లెక్కన లక్ష 5 వేలకు చేరింది. అలాగే పెరిగిన పని దినాలతో అదనంగా కూలీలకు లబ్ది చేకూరనుంది. కొత్త పథకంలో వ్యవసాయ పనుల నిమిత్తం ఏడాదికి 2 నెలల పాటు పనులు నిలిపి వేయనున్నారు.



