Thursday, July 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు గుడ్‌న్యూస్.!

రైతులకు గుడ్‌న్యూస్.!

- Advertisement -

యాప్ లేకపోయినా నో ప్రాబ్లమ్, రూ.10తో యూరియా బుక్ చేసుకోండిలా.!
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణలోని రైతులకు మరింత ఊరటనిస్తూ వ్యవసాయశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియక లేదా సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ అధికారిక ‘ఫర్టిలైజర్ యాప్’ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం మీసేవ కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.కేవలం రూ. 10 నామినల్ రుసుము చెల్లించి రైతులు తమకు కావలసిన యూరియాను మీసేవ సెంటర్ల ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.

ఈ ప్రక్రియ కోసం రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్ నంబర్, ప్రస్తుత సాగు విస్తీర్ణం మరియు పండిస్తున్న పంట వివరాలను మీసేవ కేంద్రంలో అందించాల్సి ఉంటుంది.ఈ వివరాలన్నింటినీ సిస్టమ్‌లో నమోదు చేసిన తర్వాత, రైతు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.ఆ OTP ని వెరిఫై చేసిన వెంటనే బుకింగ్ ప్రక్రియ పూర్తయి, ఒక ప్రత్యేకమైన బుకింగ్ ఐడీ (Booking ID) జారీ అవుతుంది.

అయితే, రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బుకింగ్ ఐడీకి పరిమిత కాల పరిమితి ఉంటుంది. యూరియా బుక్ చేసిన తేదీని మినహాయించి,ఆ తర్వాత కేవలం 48 గంటల పాటు (రెండు రోజులు) మాత్రమే ఈ ఐడీ చెల్లుబాటులో ఉంటుంది. అందువల్ల  రైతులు నిర్దేశిత గడువు ముగిసేలోపే తమకు కేటాయించిన డీలర్ లేదా సొసైటీ వద్దకు వెళ్లి, ఆ బుకింగ్ ఐడీని చూపించి తమ యూరియా స్టాక్‌ను సేకరించుకోవాల్సి ఉంటుంది.గడువు దాటితే బుకింగ్ రద్దవుతుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సకాలంలో ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -