- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణంలో ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభమైన కిడ్జీ న్యూ జనరేషన్ పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పి. ప్రసాదరావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న విద్యా సేవలు, విద్యార్థుల హాజరు, నమోదు (ఎన్‌రోల్‌మెంట్) తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేలా పాఠశాలను నిర్వహించాలని కరస్పాండెంట్ శెట్టిపల్లి రఘురాం కు సూచించారు. అలాగే హాజరు పట్టికలు, అడ్మిషన్ రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీలు ప్రభాకరాచార్యులు, రామారావు పాల్గొన్నారు.
- Advertisement -



